📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
District News

సండే మార్కెట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో రావణ దహనం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
సండే మార్కెట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో రావణ దహనం
  • విద్యుత్ దీపాల వెలుగులు.. బాణసంచా పేలుళ్లతో మార్మోగిన రామచంద్రపురం
  • పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ప్రత్యేక ఏర్పాట్లు
విజయదశమి పండుగను పురస్కరించుకుని రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తన స్వచ్ఛంద సంస్థ పీఎన్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సండే మార్కెట్ పరిసరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో పాటు, భారీ ఎత్తున బాణసంచా కాల్చడంతో ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.
కార్యక్రమంలో భాగంగా ముందుగా రామచంద్రపురం మందుముల శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ ఐదుగుళ్ల పోచమ్మ తల్లి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి బూరుగడ్డ పుష్పనగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జమ్మి పూజలో పాల్గొన్నారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి గాంధీ బాలవిహార్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సండే మార్కెట్‌లో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
రావణ దహన కార్యక్రమం సందర్భంగా సండే మార్కెట్ ఆవరణ విద్యుత్ దీపాల వెలుగులతో కళకళలాడింది. బాణసంచా వెలుగులు, పండుగ సందడి స్థానికులను ఆకట్టుకున్నాయి. దసరా పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దసరా వేడుకల్లో పాల్గొన్నారు.