📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు 
                                                                         జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర ప్రతినిది
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్ల నిర్వహణ, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శాంతి, సామరస్యం, సుఖసంతోషాలు, సర్వతోముఖాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.