బుధవారం భైంసాలో ప్రజావాణి నిర్వహణ
- ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉండనున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
నిర్మల్, నవంబర్ 24 (సాక్షర ప్రతినిధి):జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపే లక్ష్యంతో బుధవారం భైంసాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.ఈ సందర్భంగా 25.11.2026 (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.భైంసా పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసు శాఖ కోరింది. ప్రతి ఫిర్యాదుపై తగిన పరిశీలన జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని పేర్కొంది
