- నిజామాబాద్ర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, సాక్షర : సమాజ హితమే సేవగా భగవంతుడిని నిరంతరం స్మరించాలని, సత్యమార్గంలో జీవించాలని, సంపాదించిన దానిలో కొంత భాగం పేదలకు అందించాలని శ్రీ గురునానక్ దేవ్ జి చెప్పిన బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం సిక్కు మత వ్యవస్థాపకులు శ్రీ గురునానక్ దేవ్ జి 557వ జయంతిని పురస్కరించుకొని ఇందూరులోని సిక్కు సోదరులు నిర్వహించిన శోభాయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భగవంతుడిని నిరంతరం స్మరించాలని, సత్యమార్గంలో జీవించాలని, సంపాదించిన దానిలో కొంత భాగం పేదలకు అందించాలని చెప్పిన బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు జస్పాల్ సింగ్, బాబీ సింగ్, కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, బంటు ప్రీతి ప్రవీణ్, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, సిక్కు మత పెద్దలు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer
Advertisement