📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

పొగాకు విక్రయాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
పొగాకు విక్రయాలపై పోలీసుల ప్రత్యేక నిఘా
  • విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధం – 18 ఏళ్లలోపు వారికి విక్రయిస్తే కఠిన చర్యలు దుకాణదారులకు నోటీసులు జారీ.. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
**నిర్మల్, నవంబర్ 24 (సాక్షర ప్రతినిధి):**జిల్లా వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల విక్రయాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పొగాకు నియంత్రణ చట్టం–2003 అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భైంసా అదనపు పోలీసు అధికారి సాయి కిరణ్, నిర్మల్ ఉప పోలీసు అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తూ పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి చట్ట నిబంధనలను వివరిస్తున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టకూడదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

**చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు:**18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నిషేధం.విద్యాసంస్థలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చేయరాదు.బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయి.పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.దుకాణదారులు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించాలని పోలీసులు కోరారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు