అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు కౌన్సెలింగ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంచిర్యాల పోలీసులు గురువారం అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్‌నగర్‌లో రౌడీషీటర్ల ఇళ్లను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రౌడీషీటర్ల ప్రస్తుత పరిస్థితి,వారి కార్యకలాపాలు, ప్రవర్తన తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.నేర కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని స్పష్టం చేశారు.
రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు వచ్చి, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవిస్తే,నిబంధనల ప్రకారం వారి రౌడీషీట్లను తొలగించే అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని, చట్ట వ్యతిరేకంగా, గోడవలు, బెదిరింపులకు పాల్పడడం, శాంతి భద్రత లకు పాల్పడితే రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుందనీ డీసీపీ తెలిపారు.
అదేవిధంగా, ఎవరైనా రౌడీషీటర్ తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక శక్తులతో సంబంధాలు కొనసాగించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. రౌడీషీటర్ల కదలికలు, వారి ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంతమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
