📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి
‹
›
District News

యశోద హాస్పిటల్స్ అత్యాధునిక యూరాలజీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవలతో నిజామాబాద్ వాసులకు మెరుగైన ఆధునిక చికిత్స

◉ T PRAKASH RAO   |   ◷ Latest
యశోద హాస్పిటల్స్ అత్యాధునిక   యూరాలజీ  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సేవలతో నిజామాబాద్ వాసులకు మెరుగైన ఆధునిక చికిత్స
  • చివరి దశ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లకు కిడ్నీ మార్పిడి అనేది ఒక అత్యుత్తమ చికిత్స

సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 28 : కిడ్నీ, ప్రొస్టేట్, ఇతర యూరాలజీ సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి (ట్రాన్స్ ప్లాంటేషన్) వంటి సంక్లిష్ట చికిత్సల కోసం నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆధునాతన నూతన సాంకేతిక అభివృద్ధి తో అత్యాధునిక వైద్య సేవలు Yashodha ఆసుపత్రిలో మరింత చేరువయ్యాయి. యూరాలజీ సమస్యలను నియంత్రణించడంలో మరియు పేషెంట్లు త్వరగా కోలుకోవడంలో, వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం చాలా ముఖ్యమని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ రీనల్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి వివరించారు.

కిడ్నీలో రాళ్లు ప్రొస్ట్రేట్ గ్రంధి వాపు మరియు మూత్రణాల సమస్యలకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి రోజువారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

కిడ్నీ మూత్రశయం మరియు ప్రో స్టేట్ క్యాన్సర్లతో సహా న్యూరాలజికల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, వాటికి సమగ్ర చికిత్స అందించడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు.
లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీ సర్జరీలలో వచ్చిన అత్యాధునిక మార్పుల వల్ల, ఎంపిక చేసిన పేషెంట్లకు మినీ మళ్లీ ఇన్వాసివ్ సర్జరీలు చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చివరి దశ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లకు కిడ్నీ మార్పిడి అనేది ఒక అత్యుత్తమ చికిత్స అని డాక్టర్ మధుసూదన్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు.

యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూడు దశాబ్దాలుగా వైవిధ్యమైన వైద్య అవసరాలు కలిగిన ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తుంది.
హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ కు సోమాజిగూడ సికింద్రాబాద్ మలక్పేట్ మరియు హైటెక్ సిటీలలో 4 స్వాతంత్ర ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మొత్తం 4000 బెడ్ల సామర్థ్యం ఉంది. నాణ్యత అద్భుతమైన సేవలు మరియు పేషంట్ల పట్ల సానుభూతిని నిరంతరం కొనసాగిస్తూ యశోద గ్రూప్ ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలను తక్కువ ధరలకే అందిస్తోంది.
ఇందులో భాగంగానే అత్యాధునిక మినీ మల్లి ఇన్వసివ్ చికిత్సలను సైతం సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తుంది అని ఆయన అన్నారు.