📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి
‹
›
District News

పి.ఎం. శ్రీ పాఠశాలలలో ప్రతిభకు వేదికగా జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం

◉ G Radhakrishna Goud   |   ◷ Latest
పి.ఎం. శ్రీ పాఠశాలలలో ప్రతిభకు వేదికగా జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం
  • KB Asf
పి.ఎం. శ్రీ పాఠశాలలలో ప్రతిభకు వేదికగా జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్

అక్టోబర్ 28, 2026:
జిల్లాలోని 18 ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి జిల్లా స్థాయి ఆర్ట్ & కల్చరల్ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని తెలిపారు. పి.ఎం. శ్రీ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి కళా నైపుణ్యాలు, సాంస్కృతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు

అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డాన్స్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో-ఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, న్యాయ నిర్ణీతలు రమేష్, గుర్రాల వెంకటేశ్వర్లు, రామస్వామి, పిఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది*