చెన్నూరు సాక్షర :పోలీస్ అమరవీరులసంస్మరణదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూర్ పట్టణ పోలీస్ సౌజన్యంతో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో బుధవారం చెన్నూర్ పోలీస్ స్టేషన్ లోరక్తదానశిబిరాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ యువకులతో పాటు పోలీస్ సిబ్బంది స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ శిబిరంలో ప్రజలు, పోలీసు అధికారులు కలిపి మొత్తం 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారిని ఆదుకునేందుకు రక్తదాతలు ముందుకు రావాలని చెన్నూర్ పట్టణ సీఐ, చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఖుదోసియానహిదిన్ పిలుపునిచ్చారు.ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. ఒకరు చేసే రక్తదానం అవసరంలో ఉన్నవారికి ప్రాణదానం చేయగలదని పేర్కొన్నారు. రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్‌ఐ శ్యామ్ పటేల్, చెన్నూర్ పోలీస్ సిబ్బంది శంకర్, రమేష్, జీవన్, అనిల్, సాయి, భూమన్న, సహెరా, మనీషా, స్వప్న, ఖదీర్ దుర్గయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, మునిసిపల్ వైస్ చైర్మన్ వినయ్, కౌన్సిలర్స్ స్రవంతి సంతోష్ , ఇమ్రాన్, కోఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ, జోడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు
— Kodishetti SathishChennur Constituency Rept