📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి
‹
›
District News

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన కూచాడి శ్రీహరిరావు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన కూచాడి శ్రీహరిరావు
  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నాయకులు
నిర్మల్ అక్టోబర్ 28 (సాక్షర ప్రతినిధి).నిర్మల్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు బుధవారం వారి స్వగృహాల్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పట్టణంలోని బెస్తవారిపేటకు చెందిన విశ్రాంత పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ చలివేంద్రి శ్రీహరిరావు మంగళవారం మృతి చెందగా, బుధవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంజులాపూర్‌కు చెందిన గొండ (మంగళారపు రాజన్న) సోమవారం మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో కలిసి సానుభూతి వ్యక్తం చేశారు.అదేవిధంగా, బోయివాడ బస్టాండ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రవీందర్ తండ్రి సోమవారం మృతి చెందడంతో, వారి కుటుంబాన్ని కూడా కూచాడి శ్రీహరిరావు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, గండి రామన్న ఆలయ కమిటీ చైర్మన్ కొట్టె శేఖర్, మంజులాపూర్ మాజీ ఎంపీటీసీ నర్సారెడ్డి, పద్మనాభ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.