📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS రైతులు పశుగ్రాసం సాగు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి
‹
›
District News

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

◉ G Radhakrishna Goud   |   ◷ Latest
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
  • KB Asf
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి

అక్టోబర్ 28, 2026:
సమాచార హక్కు చట్టంలోని ప్రతి సెక్షనుపై ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బో రెడ్డి అయోధ్య రెడ్డి, వైష్ణవి మెర్ల, జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, అదనపు ఎస్.పి. చిత్తరంజన్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి లతో కలిసి అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం సెక్షన్ల అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆర్.టి.ఐ. దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం పూర్తి పారదర్శకంగా, సరళీకృతంగా ఉండేలా చూడాలని, ఆర్.టి.ఐ. దరఖాస్తు అంటే ఎలాంటి ఆందోళన, భయం ఉండకూడదని, దరఖాస్తులోని అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని, ఇవ్వవలసిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని సూచించారు. ప్రపంచంలో 132 దేశాలలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలవుతుందని, సంస్థ విధులు, బాధ్యతలు అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు, నిర్ణయ ప్రక్రియ, పర్యవేక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ లపై అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారులకు, పౌరులకు సమాచారాన్ని సకాలంలో అందించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమాచార హక్కు చట్టంలోని అంశాలు సెక్షన్లపై సమాచార కమిషనర్లు వివరించారు. అనంతరం సమాచార హక్కు చట్టం అప్పీలు దరఖాస్తులపై హియరింగ్ నిర్వహించారు.

అంతకుముందు సమీకృత జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సమాచార కమిషనర్లకు జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు.

ఈ కార్యక్రమంలో అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు పాల్గొన్నారు.

*కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది*
Conference Hall
Conference Hall