- ప్రజల ఇబ్బందులు తెలుసుకుని తక్షణ స్పందన
రామచంద్రపురం: రామచంద్రపురం 268వ డివిజన్ పరిధిలో రైల్వే ట్రాక్ రోడ్డు నుంచి భారతీనగర్‌కు వెళ్లే మార్గంలో పాడైపోయిన రోడ్డుకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పరమేష్ యాదవ్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. రోడ్డు గుంతల కారణంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుసుకున్న ఆయన, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో బుధవారం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టించారు. ఈ సందర్భంగా పరమేష్ యాదవ్ మాట్లాడుతూ, రామచంద్రపురం డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, సాయి, రాములు యాదవ్, నర్సింహ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter