📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

బెల్లంపల్లి ఏరియాలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)వెంకటేశ్వర్లు పర్యటన.

◉ M VIJAYA   |   ◷ Latest
బెల్లంపల్లి ఏరియాలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)వెంకటేశ్వర్లు పర్యటన.
  • వ్యూ పాయింట్ నుండి కైరిగూడ పని స్థలాలను వీక్షిస్తున్న డైరెక్టర్.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియాలో బుధవారం సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కే.వెంకటేశ్వర్లు,ఏరియా జిఎం ఎం.శ్రీరమేష్ తో కలిసి పర్యటించారు.వ్యూ పాయింట్ నుండి త్వరలో ప్రారంభం కానున్న గోలేటి ఉపరితల గని పని స్థలాలు,విస్తరణ ప్రదేశాలను పరిశీలించారు.ఓసి అనుమతులు,చేయాల్సిన పనుల విషయంలో ఏరియా అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం జిఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.సాయంత్రం ఖైరీగుర ఓపెన్ కాస్ట్ పనిస్థలాలను వ్యూ పాయింట్ నుండి సందర్శించారు.5స్టార్ రేటింగ్ సాధించినందుకు అధికారులను అభినందించారు.
వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నాణ్యతతో సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖైరిగుర పిఓ మచ్చగిరి నరేందర్,ఇంచార్జీ ఏరియా ఇంజినీర్ జ్ఞానేశ్వర్,ప్రాజెక్ట్ ఇంజినీర్ నరేష్,ఖైరీగుర ఓసి ఇంచార్జీ మేనేజర్ గౌతం రాజేష్,గోలేటి మేనేజర్ మహేష్,ఏరియా ఇంచార్జీ సెక్యూరిటీ అధికారి రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.