సాగునీరు అందించి పంటలను కాపాడండి - రైతుల రాస్తారోకో
సాగునీరు అందించి పంటలను కాపాడంటి అంటూ రైతులు రాస్తారోకో చేశారు. గురువారం రోజున మండలంలోని తిమ్మాపూర్ రాంపూర్ గ్రామాల రైతులు లక్షెట్టిపేట జన్నారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మండల సర్పంచుల ఫోరం మాజీ అద్యక్షులు జాడి గంగాధర్ మాట్లాడుతూ మండలంలో సరైన సమయంలో కడెం ఆయకట్టు నీరు నిలిపివేయడంతో పంట చేతికచ్చే సమయంలో నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని అయన అన్నారు. వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం రైతులను ఆడుకోవడానికి అనేక సూచనలు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు కాని ఇప్పుడు పంట పొట్ట దశకు చేరిన సమయంలో నీరు నిలిపేసి రైతులను నిండా ముంచుతున్నారని ఇదేనా రైతులను ఆడుకునే ప్రభుత్వం అని విమర్శించారు. ప్రభుత్వ ప్రజాప్రతినిదులు అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి కడెం ఆయకట్టు నీరు చివరి పంటలవరకు అందేలా చేడాలని అయన కోరారు. సాగునీరు రానిఎడల రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు జునుకూరి మల్లయ్య జాడి రాజన్న పోషన్న, లక్ష్మణ్ శంకరయ్య, బాలరాజు, రాంపూర్ ఉపసర్పంచ్ వెంకటేష్, జాడి లచ్చన్న, శంకర్ లక్ష్మణ్, గుండా లచ్చన్న, గుండా నరసయ్య, వెంకటేష్, జితేందర్, గోపాల్, తిమ్మాపూర్ ఉపసర్పంచ్ నగేష్, బానయ్య ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు
