📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రాంపూర్ లో వైద్య శిభిరం
‹
›
District News

శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం.
  • ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
నిర్మల్ నవంబర్ 5 (సాక్షర ప్రతినిధి)
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నందన్ పాల కేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నూతన పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందన్ పాల కేంద్రం ప్రజల ఆదరణ పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్.పి. రాజు, చెనిగరపు నరేష్, పెండం శ్రీనివాస్, కొండాజీ రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.