📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రాంపూర్ లో వైద్య శిభిరం
‹
›
District News

కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20 లక్షల నిధులు కేటాయిస్తూ తీర్మానం

◉ T PRAKASH RAO   |   ◷ Latest
కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20 లక్షల నిధులు కేటాయిస్తూ తీర్మానం
  • పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్...
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర, నవంబర్ 5: కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20 లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయంచినందున అన్ని డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నగరంలోని 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20 లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. అర్బన్ నియోజకవర్గంలో డివిజన్కు కోటి రూపాయల పనులు కూడా కొన్ని డివిజన్లో ప్రారంభమయ్యాయని, కొనసాగుతున్న పనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. అమృత్ 2 పథకం కింద నగరంలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి సూచించడం జరిగిందన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, కావున పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రధానంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగిందన్నారు. అలాగే ఇందూరులోనే ఘన చరిత్ర గల అతి పురాతనమైన ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్ వే కూడా రాబోతుందన్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు సందర్శించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా, 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 35వ డివిజన కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు పవన్ ముందడ , శ్రీనివాస్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.