📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రాంపూర్ లో వైద్య శిభిరం
‹
›
District News

యువతను భక్తి మార్గంలో నడిపించడమే లక్ష్యం – మాదాడి పూర్ణచందర్రావు

◉ Kotha Venugopal   |   ◷ Latest
యువతను భక్తి మార్గంలో నడిపించడమే లక్ష్యం – మాదాడి పూర్ణచందర్రావు
  • భగవద్గీత పుస్తకాల ఆవిష్కరణ
జన్నారం సాక్షర
సమాజంలోని యువతను భక్తి మార్గంలో నడిపించడమే లక్ష్యం అని ప్రముఖ పారిశ్రామిక వేత్త మదాడి పుర్ణచందర్ రావు అన్నారు. గురువారం రోజున మండలకేంద్రంలో శ్రీ భగవద్గీత పుస్తకాలను అయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సద్గురు శ్రీ శ్రీ యోగనంద భారతి స్వామి వారి ఆశీర్వాదంతో ఈరోజు భగవద్గీత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గం వైపు అడుగులు వేయాలని, భగవద్గీతలోని విలువైన బోధనలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవితంలో ఆచరించాలని ఆకాంక్షిస్తున్నట్లు అయన తెలిపారు.నేటి యువతలో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందించడంతో పాటు ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.యువత భక్తి మార్గంలో పయనిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందిస్తున్నట్లు అయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖులు కాశెట్టి లక్ష్మణ్ కొత్త శ్రీనివాస్ గుప్తా లక్ష్మీనారాయణ సామల్ల లక్ష్మీరాజం సతీష్ గౌడ్ జెల్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.