రాంపూర్ లో వైద్య శిభిరం
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. గురువారం రోజున మండలంలోని రాంపూర్ గ్రామంలో మండల ప్రభుత్వ వైద్య సిబ్బంది అద్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరంలో మలేరియా,డెంగ్యూ ,వైరల్ ఫీవర్ టైఫాయిడ్ డయేరియా లాంటి వ్యాధులు రాకుండా చేయవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత నీరు నిలువ ఉండకుండా చూసుకోవడం అలాగే దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్త పడాలని పరిశుభ్రమైన నీరు పౌష్టికాహారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వైద్య పరీక్షలు బీపీ, షుగర్ మరియు రక్త పరీక్షలు చేసి మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ గ్రామ సర్పంచ్ నూతి రామయ్య ఉపసర్పంచ్ వెంకటేష్ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి రమేష్ ఏఎన్ఎం పద్మ ఆశ కార్యకర్త వసంత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
