కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి
- నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి గురువారం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు సామాజిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంబంధిత వ్యక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
