📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS 31న జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం
‹
›
District News

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి
  • పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ
ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామానికి చెందిన పటాన్చెరు పాపయ్య, భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన పసుపుల విక్రంలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి పాపయ్యకు ఒక లక్ష 25 వేల రూపాయలు, విక్రమ్ కు ఒక లక్ష 50 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.