📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి
‹
›
District News

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
  • ఘన్‌పూర్‌ నూతన గ్రామ పంచాయతీ భవనం, హెల్త్ సబ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
సాక్షర, నిజమాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 29:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. గురువారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, హెల్త్ సబ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఘన్‌పూర్ గ్రామంలో ఇప్పటివరకు రూ.కోటికి పైగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోందని భూపతి రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.60 వేల కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. ఘన్‌పూర్ గ్రామంలో ఇప్పటికే 50 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
*మాధవ్‌నగర్ ROBపై బీజేపీ వైఖరి సిగ్గుచేటు*
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) వద్ద బీజేపీ నాయకులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మాధవ్‌నగర్ ROB నిర్మాణానికి మొదట రూ.93 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం కాగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.63 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.30 కోట్లుగా ఉందని భూపతి రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటల్లో 1 కోటి రూపాయాలు మినహా రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి వాటాను చెల్లించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ గ్రిడ్ పనుల కారణంగా నిర్మాణ పనులను ఆరు నెలల పాటు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆధారాలతో సహా చూపించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం పెంచిన 18 శాతం జీఎస్టీ ప్రభావంతో రూ.93 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం రూ.102 కోట్లకు పెరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు, వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే అన్నారు. మాధవ్‌నగర్ ROB నిర్మాణంలో ఎవరి బాధ్యత ఎంత ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని, రాజకీయ విమర్శల కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవి కిరణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్, తారాచంద్ నాయక్,సాయరెడ్డి , భాస్కర్ రెడ్డి, పొలాసని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, షాదుల్లా, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు, సుదర్శన్, AG దాస్, ధర్మాగౌడ్, నరేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.