ఆరుతడి పంటలకు ప్రాదాన్యత ఇవ్వండి ఏం ఎల్ ఏ బోజ్జు పటేల్
జన్నారం మండలంలోని రైతులు వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలకు ప్రాదాన్యత ఇవ్వాలని ఖానాపూర్ శాసనసబ్యులు బోజ్జు పటేల్ తెలిపారు. గురువారం రోజున మండలకేంద్రంలోని రైతువేదిక కల్యానలక్ష్మి శాదిముభారాక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి విచ్చేసిన అయన ప్రస్తుత వాతావరణ పరిస్థితులపట్ల వరిపంటలకు నీరు అందక రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా వున్నాయని రైతుల క్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరిపంటలు వేయకుండా ఆరుతడి పంటలు కూరగాయలు తక్కువ నీటి లబ్యతతో పండే పంటలను వేయాలని ప్రభుత్వ వ్యవసాయశాఖ సూచిస్తున్నదని అందుచేత రైతులు ఈ సూచనలు పాటించి ఎవరు నష్టపోవద్దని అయన సూచించారు. ఈ సందర్బంగా మండలంలోని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటి చైర్మెన్ దుర్గం లక్ష్మినారాయణ పోనకల్ ప్యాక్స్ చైర్మెన్ అల్లం రవి మండల తహసిల్దార్ బక్కయ్య ఆర్ ఐ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
