📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
28°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
‹
›
District News

గ్రామాల్లో సమస్యలు లేకుండా చూసుకోవాలి ఏం ఎల్ ఏ బోజ్జు పటేల్

◉ Kotha Venugopal   |   ◷ Latest
గ్రామాల్లో సమస్యలు లేకుండా చూసుకోవాలి ఏం ఎల్ ఏ బోజ్జు పటేల్
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని గ్రామాలలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఖానాపూర్ శాసనసబ్యులు వి బోజ్జు పటేల్ అన్నారు. గురువారం రోజున మండలకేంద్రంలోని మండల పరిషత్ అబివృద్ది కార్యాలయంలో మండలంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి అయన ముఖ్య అతిదిగా హాజరైనారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామ అబివ్రుద్దితోపాటు గ్రామాల ప్రజలకు సమస్యలు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో వుండాలని అయన సూచించారు. అదేవిదంగా ఇప్పుడు వస్తున్న వాతావరణ మార్పులపై ప్రభుత్వ సూచనలు చేరేలా చేస్తూ ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించేవిదంగా చూడాలని అయన తెలిపారు. అదేవిదంగా గ్రామ అధికారులు మండల అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమస్యలపై చర్చించుకోవాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మార్కెట్ కమిటి చైర్మెన్ దుర్గం లక్ష్మీనారాయణ పోనకల్ ప్యాక్స్ చైర్మెన్ అల్లం రవి మండల పరిషత్ అబివృద్ది అధికారి ఉమర్ షరీఫ్ మండలంలోని సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.