చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
- 59 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు
చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ద్వారా 59 మంది బాధితులకు ఉచితంగా కంటిఆపరేషన్లనువిజయవంతంగా పూర్తి చేసినట్లు చెన్నూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్ తెలిపారు.
దివంగత బన్సీదర్, కౌసల్య భాయ్ లాహోటి స్మారకార్థం, లయన్స్ క్లబ్ వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో, కరీంనగర్ రేకుర్తి లోని 'ఉదార నేత్ర వైద్యశాల' సౌజన్యంతో ఈ నెల 27 (సోమవారం) నాడు స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్లో ఉచిత నేత్రవైద్యశిబిరాన్నినిర్వహించారు. ఈ శిబిరంలో ఆపరేషన్లకు ఎంపికైన 59 మందికి రేకుర్తి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఆపరేషన్లు పూర్తయిన అనంతరం బుధవారం వారంతా సురక్షితంగా చెన్నూర్ చేరుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లబ్ధిదారుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, వైద్యులు సూచించిన విధంగా చుక్కల మందులు సరిగా వాడాలని తెలిపారు. అలాగే వచ్చే నెల (నవంబర్) 6వ తేదీన శుక్రవారం రోజున రీ-చెకప్ కోసం తప్పకుండా రేకుర్తి కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
బాధితుల హర్షం:
మాలాంటి నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి చూపు ప్రసాదించిన రేకుర్తి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు చెన్నూర్ లయన్స్ క్లబ్ సభ్యులకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హాజరైన ముఖ్య అతిథులు:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ ఛైర్పర్సన్ లయన్ జాడి తిరుపతి, ఐ క్యాంప్ చైర్పర్సన్ జక్కుల సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు పప్పిరెడ్డి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు
