బూమచారికి మండల ట్రాక్టర్ అసోసియేషన్ మద్దతు
జన్నారం మండలకేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న సామజిక కార్యకర్త శ్రీరాముల బూమాచారికి మండల ట్రాక్టర్ అసోసియేషన్ అద్వర్యంలో మద్దతు తెలిపారు. గురువారం రోజున మండల ట్రాక్టర్ అసోసియేషన్ సబ్యులు గత 68 రోజుల మండల అబివృద్ది మండల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిరాహార దీక్ష చేస్తున్న మండల సామజిక కార్యకర్త శ్రీరాముల బూమచారి శిబిరానికి చేరుకొని అయన దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో అటవీశాఖ ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రాంతం పూర్తిగా అబివృద్దికి దూరంగా మారుతుందని వారు అన్నారు. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఎత్తివేయాలని సెన్సిటివ్ జోన్ పరిదిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మన సామజిక కార్యకర్త బూమాచారి ఇన్నిరోజులుగా దీక్షలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాదాకరం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బొంతల చంద్రమౌళి అనుముల శ్రీనివాస్ కొత్త తిరుపతి కాశెట్టి శ్రీనివాస్ కటకం సతీష్ రాథోడ్ తుకారాం తదితరులు పాల్గొన్నారు.
