📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS 5 వ సారి రక్తదానం చేసిన మంద రాజేష్
‹
›
District News

భానూరులో రూ.10 లక్షలతో ఫార్మేషన్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
భానూరులో రూ.10 లక్షలతో ఫార్మేషన్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
  • గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్ శాంతయ్య వినతి
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ శాంతయ్య, పాలకవర్గ సభ్యులు ఎంపీని సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శాంతయ్య మాట్లాడుతూ, ఎంపీ రఘునందన్ రావు సహకారంతో ఫార్మేషన్ రోడ్డుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పటాన్‌చెరు నుంచి శంకర్‌పల్లి వరకు రహదారి నిర్మించాలని, భానూరు నుంచి కంచర్లగూడెం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. బీడీఎల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికి ఎంపీ సహకారం అందించాలని కోరారు. పార్టీ భేదాలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఎవరి వద్దకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధికి ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పర్యటన సందర్భంగా సీఆర్‌ఎఫ్ నిధులతో విశాఖ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి శంకర్‌పల్లి వరకు మంజూర్ ఐతే శంకుస్థాపన చేసిన చోటు విషయాన్ని ప్రస్తావించారు.
భానూరు గ్రామ మహిళా సమైక్య భవనానికి రూ.10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ తీర్మానం చేసి భవన నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. గ్రామానికి అవసరమైన రహదారి విషయంలో పది రోజుల క్రితమే సంబంధిత డీఈతో మాట్లాడి ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. ఇంకా నా సహాయ సహకారం ఉంటుందని గ్రామ అభివృధి కలిసి చేసుకుందామని అన్నా.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లత, పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.