📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS సింగరేణి మనుగడ,కార్మికుల హక్కులు ఐఎన్టీయూసి తోనే సాధ్యం.
‹
›
District News

దసరాకి కూడా జీతాలకు నోచుకోని సిహెచ్పి కాంట్రాక్టు కార్మికులు.

◉ M VIJAYA   |   ◷ Latest
దసరాకి కూడా జీతాలకు నోచుకోని సిహెచ్పి కాంట్రాక్టు కార్మికులు.
  • అంబాల ఓదెలు అధ్యక్షులు,టీబీజీసీకేఎస్ బెల్లంపల్లి ఏరియా.
రెబ్బెన,సాక్షర:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా దసరా బోనస్ నుండి కాంట్రాక్టర్లు జిఎస్టి పేరుతో 500కట్ చేశారని టీబీజీసీకేఎస్ బెల్లంపల్లి ఏరియా అధ్యక్షులు అంబాల ఓదెలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన గోలేటిలో మాట్లాడుతూ గోలేటి సిహెచ్పిలో రాక్ చెకింగ్,రాక్ మెయింటెనెన్స్,బెల్ట్ క్లీనింగ్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా దసరా బోనస్ 5500నుండి ఏకపక్షంగా కాంట్రాక్టర్లు సమ్మయ్య,గోపిరెడ్డి లు జిఎస్టి పేరుతో 500రూపాయలను కట్ చేశారని,ఈ విధంగా సింగరేణిలో ఎక్కడ కూడా కట్ చేయలేదన్నారు.జిఎస్టి పేరుతో కట్ చేసిన 500వందల రూపాయలను వెంటనే తిరిగి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని లేనిపక్షంలో జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వస్తుందన్నారు.ప్రతి నెల 7తారీఖు లోపల జీతాలు చెల్లించాలని జిఎం కార్యాలయంలో తాటికాయ అంత అక్షరాలతో రాసుకున్న అధికారులు దసరా పండుగ పూట జీతాలు లేక కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైనప్పటికీ జీతాలు చెల్లించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు.దసరా పండుగ కాదు కదా ఈరోజు వరకు కూడా జీతాలు చెల్లించలేదని,పైగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా నుండి 500 మాత్రం కట్ చేసుకున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.వెంటనే జీతాలు చెల్లించి జీఎస్టీ పేరుతో కట్ చేసిన 500రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.