- ఓటరు హక్కుల పరిరక్షణపై కాంగ్రెస్ నాయకుల సమీక్ష సమావేశం
పటాన్‌చెరు: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో పటాన్‌చెరులో ‘VOTE BACHAO – DESH BACHAO’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ సరల్ పటేల్, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేటర్లు నాగరిగారి ప్రీతమ్, గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందుబాటులో ఉండేలా చూడాలని నాయకులు చర్చించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల్లోని తప్పులను గుర్తించి, వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంతో పాటు ప్రతి ఓటరు హక్కును పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు.
— Vukkalkar VivekStaff Reporter