📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS జాతీయ స్థాయి వూషూ పోటీలకు నిర్మల్ క్రీడాకారుల ఎంపిక
‹
›
District News

చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఇద్దరు యువకులు అరెస్ట్

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఇద్దరు యువకులు అరెస్ట్
  • సోషల్ మీడియాలో అక్రమంగా వీడియోల ప్రచారం.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు
నిర్మల్, అక్టోబర్ 27 (సాక్షర ప్రతినిధి):చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి, ఇతరులు చూసే విధంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అప్‌లోడ్ చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.మామడ మండల పరిధిలోని కోమలకోట గ్రామానికి చెందిన ఒక యువకుడు, సాగర గ్రామానికి చెందిన మరో యువకుడు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుంచి చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలను డౌన్‌లోడ్ చేసి, తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అప్‌లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు సీఐ వెల్లడించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం
చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ చిత్రాలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడం, భద్రపరచడం, ఇతరులకు పంపడం లేదా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఇలాంటి అక్రమ కంటెంట్‌ను షేర్ చేయకుండా, గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని గోవర్ధన్ రెడ్డి ప్రజలకు సూచించారు.