📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ
‹
›
District News

శ్రీనివాస కాలనీలో ₹50 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
శ్రీనివాస కాలనీలో ₹50 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం
  • ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్
పటాన్చెరు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు శ్రీనివాస కాలనీలో ₹50 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్, డీఈ, 17వ వార్డు కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

శ్రీనివాస కాలనీలో డ్రైనేజీ సమస్యతో ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు కాలనీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రూ.50 లక్షల నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్ మాట్లాడుతూ.. 17వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. ప్రారంభించిన డ్రైనేజీ పనులను నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న మున్సిపల్ చైర్మన్ మోటో సుమలత శ్రీకాంత్, కమిషనర్, డీఈ, తోటి కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నరసింహ రెడ్డి, సంపత్, రాఘవేందర్, గోపాల్ రెడ్డి, సందీప్, నారాయణ దాస్, మణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీనివాస కాలనీవాసులు పాల్గొన్నారు.