రామచంద్రపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుబాబుల వీరంగం
- రాత్రి వేళ మద్యం సేవించి ఖాళీ బాటిల్‌ను అక్కడే వదిలివేత
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. రాత్రి వేళ ఆసుపత్రిలో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు అక్కడ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అనంతరం మద్యం బాటిల్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. రోగులకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
