జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్లు తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురిలో ఇద్దరు గీతం ఎన్‌సీసీ విద్యార్థులే
ఎంపికైన వారిలో సీనియర్ డివిజన్‌కు చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ ఎ. అభినవ్ సాయి కార్తీక్, సీనియర్ వింగ్‌కు చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ తమ్ములూరి కావ్య ఉన్నారు. డ్రోన్ కార్యకలాపాలపై వారికున్న ఆసక్తి, సాంకేతిక నైపుణ్యం, కృషి, ప్రతిభకు ఈ ఎంపిక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా గీతం అసోసియేట్ ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీలో తమ క్యాడెట్లు డైరెక్టరేట్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నారు. వారి విజయం గీతం హైదరాబాద్‌లో అందిస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనమని, ఇతర క్యాడెట్లు సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకుని ఎన్‌సీసీ కార్యకలాపాల్లో రాణించేందుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. గీతం హైదరాబాద్ ఉన్నతాధికారులు కూడా ఇద్దరు క్యాడెట్ల విజయాన్ని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
