నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర
- ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్, ఇండీ కూటమి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా యాత్ర.. విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.ముఖ్య అతిథి సునీల్ బన్సల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్_
నవంబర్ 3న నిర్వహించనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమ విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్,బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, రమణారెడ్డి, ముత్యం రెడ్డి,మెడిసెమ్మ రాజు, భూమయ్య, సామ రాజేశ్వర్ రెడ్డి, సరికెల గంగన్న, పట్టణ, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
