📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
26°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
‹
›
District News

సింగరేణి మనుగడ,కార్మికుల హక్కులు ఐఎన్టీయూసి తోనే సాధ్యం.

◉ M VIJAYA   |   ◷ Latest
సింగరేణి మనుగడ,కార్మికుల హక్కులు ఐఎన్టీయూసి తోనే సాధ్యం.
  • పేరం శ్రీనివాస్ ఐఎన్టియుసి ఏరియా ఉపాధ్యక్షులు.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పిలో మంగళవారం ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య సూచన మేరకు బాయి బాట కార్యక్రమంలో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం,సెక్రెటరీ జనరల్ సింగరేణి పరిరక్షణకు,కార్మికుల శ్రేయస్సు కోసం పాటు పడుతున్న విషయాలను కార్మికులకు వివరంగా తెలియజేశారు.కార్మికులకు లాభాలలో వాటా,పెరిక్స్పైఐటి, రియంబర్స్మెంట్,సొంత ఇంటి పథకం అమలుపై ఉప ముఖ్యమంత్రి,కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రకటించేటట్లు పలుమార్లు వారిని కలిసి ఒప్పించిన ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషిని కార్మికులకు వివరించారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో టీబీజీకేఎస్ యూనియన్ సింగరేణి దివాలా పరిస్థితికి,నేటి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు.రాబోయే రోజుల్లో ఐఎన్టియుసి ని ఆదరిస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని,కార్మిక హక్కులు కాపాడబడతాయన్నారు.
ఈ సందర్భంగా గోలేటి సిహెచ్పి ఫిట్ కార్యదర్శి దుండ్రా రవికుమార్ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో యూనియన్ కు నష్టం చేస్తున్నందున యూనియన్ నుండి ఐఎన్టియూసి పదవి నుండి బహిష్కరించడం జరిగిందన్నారు.అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ కొవ్వూరి శ్రీకాంత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీలు గట్టయ్య,శ్యాంబాబు,సత్యనారాయణ,హరిబాబు,సదానందం,చెవ్వా సత్యనారాయణ,శీలం చందు,ఆడే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.