📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
28°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS భానూరులో రూ.10 లక్షలతో ఫార్మేషన్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
‹
›
District News

5 వ సారి రక్తదానం చేసిన మంద రాజేష్

◉ Kotha Venugopal   |   ◷ Latest
5 వ సారి రక్తదానం చేసిన మంద రాజేష్
జన్నారం సాక్షర
జన్నారం పట్టణ కాంగ్రెస్ పార్టి అద్యక్షులు మంద రాజేష్ 5 వ సారి రక్తదానం చేసి అపదలోవున్నవారిని ఆదుకున్నారు. కాంగ్రెస్ పార్టి పట్టణ అద్యక్షులు మంద రాజేష్ ఎక్కడ ఎవరు ఆపదలో వుండి రక్తదానం కొరకు సంప్రదిస్తే వెంటనే స్పందించి అక్కడకువెల్లి ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆడుకుంటాడు. మంగళవారం రోజున కరీంనగర్ లోని ప్రతిమ అసుపత్రినుండి రక్తం కావాలని అయన సమాచారం రావడంతో వెంటనే అక్కడకు వెళ్లి ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ఆదుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయినవారు చాలామంది వున్నారని నేను ఇంతవరకు 4 సార్లు రక్తదానం చేశానని ఇది 5 వ సారి అని ఆపదలో ఉన్నవారికి ఈ విదంగా సహకరించడం నాకు చాలా సంతృప్తిని అందిస్తుందని అయన అన్నారు. వీలైన వారు రక్తదానం చేసి అపదలోవున్న వారి ప్రాణాలను రక్షించాలని అయన కోరారు. ఈ సందర్బంగా కాంగ్రస్ పార్టి మండల అద్యక్షులు అజ్మీర నందునాయక్ పార్టి నాయకులు ఆయనను అబినందించారు.