📅 Monday, 02 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS కాంగ్రెస్‌, ఇండీ కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
‹
›
District News

ప్రకృతి మిత్ర తెలంగాణ కు అహుజా సౌండ్ సిస్టం విరాళం

◉ Kodishetti Sathish   |   ◷ Latest
ప్రకృతి మిత్ర తెలంగాణ కు అహుజా సౌండ్ సిస్టం విరాళం
  • అందించి స్ఫూర్తినిచ్చిన జిల్లా ఫైర్ అధికారిమామిడి భగవాన్ రెడ్డి
మంచిర్యాల సాక్షర: మంచిర్యాల జిల్లాకు చెందిన అగ్నిమాపక దళం జిల్లా అధికారి, ప్రకృతి ప్రేమికులు తెలంగాణ ప్రకృతి మిత్ర సభ్యులు మామిడి భగవాన్ రెడ్డి తన ఉద్యోగ విరమణ సందర్భంగా సందర్భంగాఆదివారంమంచిర్యాల లోని ఎం. కన్వెన్షన్ లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకృతిమిత్ర కార్యక్రమాలకు ఆకర్షితులై ఇరవై ఆరు వేల 26,000 విలువగల అంతర్జాతీయ ప్రమాణాలు గల అహుజా సౌండ్ సిస్టం ను భార్య పద్మ తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ అగ్ని మాపక దళ ఉన్నత అధికారుల సమక్షంలో ఆ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ కు విరాళంగా అందజేశారుప్రభుత్వం అమలు చేస్తున్న పలు పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రకృతిమిత్ర ద్వారా చేపట్టి ప్రజలు, యువత విద్యార్థుల్లో అవగాహన కలిగించడంఎంతోఅభినందనీయమని సభాముఖంగా ప్రత్యేకంగా కొనియాడారు.ఈ సందర్భంగా గుండేటి యోగేశ్వర్ మామిడి భగవాన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుడు ఎలినినో లాంటి వాతావరణం మార్పుల సహజ విపత్తులు రాకుండా ఉండాలంటే ప్రకృతిమితులుగా మారాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన జిల్లా ఫైర్ ఆఫీసర్లు, రాష్ట్ర హైడ్రా అధికారి ఎస్. శ్రీధర్ రెడ్డి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రవి కృష్ణ, మంచిర్యాల జిల్లా కు చెందిన స్టేషన్ ఫైర్ అధికారులు ఎంప్లాయిమెంట్ రామగోని సత్యనారాయణ రాయెళ్ళ రమేష్ బాబు, దేవనంది శ్రీనివాస్, సూరం మురళీ మనోహర్ రెడ్డి మురళి..వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.