📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
28°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బూరగడ్డ పుష్ప నాగేష్.
‹
›
District News

నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర
  • ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్
నిర్మల్ అక్టోబర్ 28 (సాక్షర ప్రతినిధి)
ఎస్‌ఐఆర్‌ (SIR)పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్న నేపథ్యంలో, ఆయన రాక కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించి, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.నవంబర్ 3న నిర్వహించనున్న మహా పాదయాత్రకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని నాయకులు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎస్‌ఐఆర్‌ అంశంపై పార్టీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జమాల్, సాదం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్, జింక సురేందర్, ఈశ్వర్, కూన శశాంక్, మాజీ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, నాయకులు కందుల హరీష్, భరత్, స్వాప్నిక్, నేరేళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.