నిరుపేద కుటుంబానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం
- దహన సంస్కారాల కోసం రూ.10 వేల అందజేత
రామచంద్రపురం: నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో దహన సంస్కారాల నిర్వహణకు ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కే. మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ స్పందించి, మల్లేష్ కుటుంబానికి దహన సంస్కారాల నిర్వహణ నిమిత్తం తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్‌ను పలువురు అభినందించారు.
