ఆచరణాత్మక శిక్షణ ద్వారా మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలి
- వయోజన విద్య ఉప సంచాలకులు ఏ. పురుషోత్తం
నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 05: అక్షర వాలంటీర్లకు అక్షర వికాసం వాచకంలోని పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, అభ్యాస కార్యక్రమాలు, నూతన అక్షరాస్యులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పించే విధానాలపై ఆచరణాత్మక శిక్షణ ద్వారా మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలని వయోజన విద్య ఉప సంచాలకులు ఏ. పురుషోత్తం సూచించారు. బుధవారం మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో వయోజన విద్యాశాఖ, స్నేహ సొసైటీ సౌజన్యంతో ULLAS – నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా కుట్టు శిక్షణ పొందుతున్న అక్షర వాలంటీర్లకు అక్షర వికాసం వాచకంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వయోజన విద్య ఉప సంచాలకులు ఏ. పురుషోత్తం, గోవూర్ సర్పంచ్ రవి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, MEO నాగనాథ్, MPO, APM, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ULLAS రిసోర్స్ పర్సన్ రాములు అక్షర వాలంటీర్లకు అక్షర వికాసం వాచకంలోని పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, అభ్యాస కార్యక్రమాలు, నూతన అక్షరాస్యులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్పించే విధానాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. అలాగే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఎల్ నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులపై కూడా చర్చించారు. కుట్టు శిక్షణతో పాటు అక్షరాస్యతను పెంపొందించుకోవడం ద్వారా మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా
వయోజన విద్యాశాఖ,
