📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
State News

కేంద్ర ప్రభుత్వం జనగణన లో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిట్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన

◉ ELUGU VAMSHIDHAR   |   ◷ Latest
కేంద్ర ప్రభుత్వం జనగణన లో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిట్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన
ఈరోజు సీసీ కార్నర్ లో కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలం పెట్టి కులానికి ఒక యూనిట్ కోడ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం 1931లో బీసీ కుల గణన చేపడితే దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న బీసీ కుల గణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షంగా భావిస్తున్నాం బీసీ కులగనను చేపట్టాలని దేశంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఉద్యమానికి తలోగ్గిన 10 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి ప్రధాని మోడీ పార్లమెంటులో మేము కులగనున చేపడతామని చెప్పిన మోడీ ఇప్పుడు మాట తప్పడం బాధాకరం జనగణన లో ఓబీసీ కాలం పెట్టకపోవడం అంటే బీసీలను మోసం చేయడమే అవుతుంది బీసీ కుల గణన చేపడితే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ ముందుకు వస్తుందని అలాగే ప్రస్తుతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్రపాలకులు భావిస్తున్నారు బీసీలకు ఇవ్వాల్సిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా ఎన్ని ఏండ్లు దాటవేస్తారని ప్రశ్నిస్తున్నాం అలాగే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి ఓబీసీ కాలంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం జనగణన లో ఓబీసీ కాలం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు ఎండగట్టి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నాం అలాగే జనగణలో ఓబీసీ సాధించేవరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, కంచర్ల సదానందం, అశోక వేముల, పెద్దల చంద్రకాంత్, దేవస్థాన నాగరాజ్, ఎండి లతీఫ్, తంగళ్ళపల్లి బాపు వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు