📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
‹
›
District News

పారదర్శకతకు మరో పేరు సింగరేణి..

◉ M VIJAYA   |   ◷ Latest
  • ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్.
రెబ్బెన,సాక్షర:దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జి జిఎం మచ్చగిరి నరేందర్ అన్నారు.సోమవారం గోలేటిలోని ఏరియా జిఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన విజిలెన్స్ వారోత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు.అనంతరం సింగరేణి ముఖ్య నిఘా అధికారి బి. వెంకన్న(ఐఆర్టిఎస్)సందేశ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర విజిలెన్స్ కమీషన్ ఆదేశాల మేరకు’’నిజాయితీ సమృద్ది ‘’నినాదంతో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో అక్టోబరు 26తేదీ నుండి నవంబర్ 1తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అవినీతి అరికట్టడానికి పరిపాలన వ్యవస్థను పూర్తి పారదర్శకంగా,నిష్పాక్షపాతంగా,జవాబు దారిగా ఉంచడానికి సింగరేణి విజిలెన్స్ విభాగం త్రిముఖ వ్యూహాలను అవలంభిస్తుందని తెలిపారు.అన్నింటా ముందున్న వారిపైన నిఘా ఎక్కువగా ఉంటుందని,ప్రస్తుతం సాంకేతికత పెరిగిపోయిందని ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.అవినీతి ఏ రంగంలో అయిన అభివృద్దికి అడ్డంకి గా మారుతుందని దాని ఫలితం సంస్థ ఆ తర్వాత దేశ పురోభివ్రుద్దిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.అవినీతి లేకుంటే సమాజంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.సింగరేణి సంస్థ విజిలెన్స్ అంశంలో దేశంలోని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీగా ఉంటామని లంచం ఇవ్వం, తీసుకోబోము అంటూ అధికారులు,ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఏఐటియూసి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి,అధికారుల సంఘం ఏరియా కార్యదర్శి వీరన్న,డిజిఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు,ఎస్ఓ టు జిఎం స్వామి రాజు,సీనియర్ పర్సనల్ అధికారి డి.ప్రశాంత్ అన్ని విభాగాల అధిపతులు,జిఎం కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.