📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

150 రోజుల బస్తీ దర్శన్ కార్యక్రమ ఆల్బమ్ ఆవిష్కరణ

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
150 రోజుల బస్తీ దర్శన్ కార్యక్రమ ఆల్బమ్ ఆవిష్కరణ
  • మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
పటాన్‌చెరు నియోజకవర్గంలోనీ రామచంద్రపురం డివిజన్ లో 150 రోజుల పాటు నిర్వహించిన డోర్ టు డోర్ బస్తీ దర్శన్ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక ఆల్బమ్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, రామకృష్ణ కలిసి ఆవిష్కరించారు. ఈ ఆల్బమ్‌లో 150 రోజుల పాటు ప్రజల మధ్య నిర్వహించిన బస్తీ దర్శన్ కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన సందర్భాలు, స్థానిక సమస్యలపై నిర్వహించిన పర్యటనలకు సంబంధించిన జ్ఞాపకాలను పొందుపరిచారు.