- అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరంగూడ డివిజన్ మాజీ కౌన్సిలర్ ప్రమోద్ రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని సిరికి ఆఫీస్, ఎఫ్ పార్క్, నేతాజీ ఫంక్షన్ హాల్, ఓల్డ్ ఎం.ఐ.జీ. బి పార్క్‌లలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఓల్డ్ ఎం.ఐ.జీ. బి పార్క్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవి నవరాత్రులు అమ్మవారి శక్తి, వైభవానికి ప్రతీకలని అన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతోపాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
— Vukkalkar VivekStaff Reporter