📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఊరేళ్ల రాజు యాదవ్ దున్నపోతు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఊరేళ్ల రాజు యాదవ్ దున్నపోతు
  • విన్యాసాలు, ఆకట్టుకునే అలంకరణతో సందర్శకులను అలరించిన దున్నపోతు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని సండే మార్కెట్‌లో సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఊరేళ్ల రాజు యాదవ్‌కు చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దున్నపోతును అందంగా అలంకరించడంతో పాటు అది ప్రదర్శించిన విన్యాసాలు అక్కడికి వచ్చిన ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దున్నపోతు విన్యాసాలను చూసేందుకు స్థానికులు, సందర్శకులు ఆసక్తి కనబరిచారు. సదర్ ఉత్సవాల్లో సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించింది.