📅 Tuesday, 03 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
29°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రకు పోటెత్తిన జనసందోహం!
‹
›
District News

కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు మృతి పార్టి జెండా కప్పి నివాళులు అర్పించిన నాయకులు

◉ Kotha Venugopal   |   ◷ Latest
కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు మృతి పార్టి జెండా కప్పి నివాళులు అర్పించిన నాయకులు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కవ్వాల గ్రామంలో కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు మోత్కూరి నర్సాగౌడ్ (75) మృతి చెందాడు. మంగళవారం రోజున మండలంలోని కవ్వాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు మోత్కూరి నర్సాగౌడ్ మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే పార్టి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ముజఫర్ ఆలీఖాన్ పార్టి నాయకులతో వెళ్లి నర్సాగౌడ్ మృతదేహంపై కాంగ్రెస్ పార్టి జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దహన సంస్కారాలు అయ్యేంతవరకు వారితోనే వుండి నర్సాగౌడ్ కుటుంబ సబ్యులకు ఓదారుస్తూ మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టి ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికీ బరోసా కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మోత్కూరి నర్సాగౌడ్ గ్రమంతోపాటు మండలంలో పార్టి అబివృద్దికి అహర్నిశలు కృషి చేశారని పార్టి కార్యకర్తలకు నిత్యం అండగా వుంటూ వారికీ ఎటువంటి సమస్యలు రాకుండా చేసుకునేవారని అయన మరణం పార్టికి గ్రామానికి మండలానికి తీరని లోటు అని అయన అన్నారు. అయన వెంట పార్టి నాయకులు గ్రామ సర్పంచ్ సక్రు నాయక్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోడేటి మల్లేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు సత్తయ్య మాజీ ఎంపీటీసీలు శేషారావు పోష గౌడ్ పార్టీ నాయకులు బాలగౌడ్ తదితరులు వున్నారు.