భైంసా గ్రీవెన్స్ డేలో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ
- ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి.. పోలీస్ అధికారులకు ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశం.
బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కుటుంబ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకునేలా సూచనలు చేశారు.అనంతరం గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలలో స్వీకరించిన ఫిర్యాదుల్లో ఇంకా పరిష్కారం కాని వాటిపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
