📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్‌–2026 ప్రకటన

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్‌–2026 ప్రకటన
  • విజేతకు రూ.9 లక్షలు.. మొత్తం రూ.20 లక్షల నగదు పురస్కారాలు
  • ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు జాతీయ స్థాయి ఏఐ ఆవిష్కరణల పోటీ
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంటర్మీడియట్, +2, డిగ్రీ విద్యార్థుల కోసం జాతీయ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆవిష్కరణల పోటీ గీతం నేషనల్ ఏఐ ఛాలెంజ్‌–2026ను ప్రకటించింది. ‘కృత్రిమ మేధస్సుతో నిర్మించండి.. జాతీయ స్థాయిలో పోటీపడండి’ అనే ఇతివృత్తంతో నిర్వహించే ఈ పోటీలో విజేతలకు మొత్తం రూ.20 లక్షల నగదు పురస్కారాలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా 11, 12 తరగతులతో పాటు అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. నిజజీవిత సమస్యలకు వినూత్నమైన, ఆచరణాత్మక ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా యువతలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs), ఏఐ ఏపీఐలు, కస్టమ్ మోడల్స్, ఆటోమేషన్ టూల్స్, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారాలు, ఏఐ ఏజెంట్ల వంటి సాంకేతికతలను ఉపయోగించి విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వవచ్చు. పోటీలో వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా నలుగురు సభ్యులతో కూడిన బృందాలుగా పాల్గొనే అవకాశం ఉంది. అన్‌స్టాప్ వేదికగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ ఆలోచన, ప్రోటోటైప్‌ను ఐదు స్లైడ్ల పిచ్ డెక్ రూపంలో సమర్పించాలి. ఇందులో సమస్య వివరణ, దాని ప్రాముఖ్యత, ఏఐ వినియోగం, పనిచేసే డెమో లేదా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వివరాలను పొందుపరచాలి. పోటీ పలు దశల్లో కొనసాగుతుంది. తొలి దశ అనంతరం టాప్ 200 జట్లకు ఆన్‌లైన్ క్వార్టర్ ఫైనల్స్, టాప్ 100 జట్లకు గీతం ప్రాంగణంలో ఆఫ్‌లైన్ సెమీ ఫైనల్స్ నిర్వహిస్తారు. చివరిగా ఎంపికైన టాప్ 20 జట్లు గ్రాండ్ ఫైనల్‌లో తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. నిపుణుల జ్యూరీ ముందు ప్రాజెక్టులను వివరించడంతోపాటు స్ట్రాటజీ వర్క్‌షాప్‌లు, పిచింగ్ సెషన్లలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు.
నగదు పురస్కారాల వివరాలు:
మొదటి బహుమతి: రూ.9 లక్షలు
రెండో బహుమతి: రూ.6 లక్షలు
మూడో బహుమతి: రూ.3 లక్షలు
రెండు రన్నరప్ జట్లకు: ఒక్కొక్కరికి రూ.1 లక్ష
పోటీలో పాల్గొన్నవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. యువతలో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, వ్యవస్థాపక ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతోపాటు, సమాజంలోని వాస్తవ సమస్యలకు ఏఐ సాంకేతికత ద్వారా పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్‌–2026 లక్ష్యమని విశ్వవిద్యాలయం వెల్లడించింది.