📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

◉ T PRAKASH RAO   |   ◷ Latest
అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత
  • కమిషనర్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు నియామక ఉత్తర్వుల కాపీ అందజేసిన సీపీ
నిజామాబాద్ జిల్లా కూ చెందిన 2025 సంవత్సరంలో విధి నిర్వహణలో అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ , పోలీస్ కానిస్టేబుల్ 1923 గారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక ఉత్తర్వుల కాపీని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ నేడు గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకునే చర్యల్లో భాగంగా , అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులకు (ప్రణిత) కు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది. అందులో భాగంగా నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నియామక ఉత్తర్వుల కాపీని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ , పోలీస్ శాఖ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని , వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. దేశం , ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.