📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

మక్కా పర్యటన ముగించుకొని నిర్మల్‌కు చేరుకున్న అజార్ హుస్సేన్‌కు ఘన సన్మానం.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
మక్కా పర్యటన ముగించుకొని నిర్మల్‌కు చేరుకున్న అజార్ హుస్సేన్‌కు ఘన సన్మానం.
  • టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీకి శాలువా, పూలమాలతో సత్కారం.. పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి,
నిర్మల్ నవంబర్ 7 సాక్షర ప్రతినిధి మక్కా పర్యటనను విజయవంతంగా ముగించుకొని నిర్మల్ పట్టణానికి చేరుకున్న టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ అజార్ హుస్సేన్‌కు ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. మక్కా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీతో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అజార్ హుస్సేన్‌కు అభినందనలు తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.