ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
- దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఉస్మాన్ నగర్ మాజీ కౌన్సిలర్ అంతగిరిపల్లె చిట్టి ఉమేశ్వర్
హైదరాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను తెల్లాపూర్ డివిజన్ 263, ఉస్మాన్ నగర్ 11వ వార్డు మాజీ కౌన్సిలర్ అంతగిరిపల్లె చిట్టి ఉమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డోకూరి రవీందర్ రెడ్డి, అంతగిరిపల్లె ప్రేమ్ కుమార్, కురుమ మణిక్యం, కుమ్మరి శ్రీశైలం పాల్గొన్నారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని వారు ఆకాంక్షించారు.
